రైల్వే స్టేషన్లలో పొగ రాయుళ్లు.. నెల రోజుల్లో 219 కేసులు

రైల్వే స్టేషన్లలో పొగ రాయుళ్లు.. నెల రోజుల్లో 219 కేసులు

రైల్వే స్టేషన్లలో పొగ రాయుళ్లు  విచ్చల విడిగా దమ్ము కొడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో పొగ రాయుళ్లను కట్టడి చేసేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నెల రోజుల్లోనే 219 కేసులు నమోదు చేశారు. కేవలం సికింద్రాబాద్ స్టేషన్ లోనే ఈ కేసులు నమోదయ్యాయి. రైల్వే స్టేషన్ పరిధిలో కొందరు వ్యక్తులు ఎక్కడపడితే అక్కడ స్మోకింగ్ చేస్తున్నారు.  రైలు బోగీల్లోనూ దమ్ము కొడుతున్నారు. నో స్మోకింగ్ అని తెలిసినా.. డేంట్ కేర్ అంటున్నారు పొగ రాయుళ్లు. 

నో స్మొకింగ్ జోన్ లోనూ పొగలు గుప్పుమంటుండడంతో అధికారులు చర్యలకు దిగారు. ఈ క్రమంలో మాక్ డ్రిల్ లో సేఫ్టీ లోపాలు బయటపడ్డాయి. రైలులో మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పొగ రాయుళ్లపై రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే, పొగ రాయుళ్లపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.