
వీడు మామూలోడు కాదు..కేవలం 22 యేళ్లు..కోట్లలో స్కామ్..అమాయకులే అతని టార్గెట్..అతిచిన్న వయసులో నాలుగు కంపెనీలు..స్టాక్ మార్కెట్ పేరుతో అతిపెద్ద కుంభకోణం..రెండు రాష్ట్రాల ప్రజలకు టోకరా.. అతని హైఫ్రొఫైల్ లైఫ్స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించాడు..సీన్ కట్ చేస్తే..పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్క బెడుతున్నాడు.
అసోంకు చెందిన 22 యేళ్ల బిషల్ పుకాన్ అనే యువకుడు 2వేల 200కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం పాల్పడినట్టు ఆరోపణలో అరెస్ట్ చేశారు పోలీసులు.. దీబ్రూఘర్ కు చెందిన పుకాన్ తన రిచ్ లైఫ్ స్టైల్, హై ఫ్రొఫైల్ తో అసోం, అరుణాచల్ ప్రదేశ్ నుండి స్టాక్ మార్కెట్ పేరుతో ఇన్వెస్టర్లను ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి.. కేవలం 60 రోజుల్లో 30శాతం రాబడిని పొందండి..అంటూ ఇన్వెస్టర్లను ఆకర్షించి మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
పుకాన్ తన క్రిమినల్ బ్రెయిన్ తో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, నిర్మాణ రంగాల్లో కంపెనీలు స్థాపించాడు. అసోం సిని పరిశ్రమలో కూడా పెట్టుబడులు పెట్టాడు. అక్రమంగా కోట్లు సంపాదించాడు. గౌహతిలో ఓ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కు సంబంధించిన కేసు బయటకు రావడంతో పుకాన్ మోసాల చిట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది.
గౌహతిలో డిబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యజమాని దీపాంకర్ బర్మన్ మిస్సింగ్ విషయంలో పుకాన్ పై ఆరోపణలు రావడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుకాన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
సోషల్ మీడియాలో ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించి కోట్లలో మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో సోమవారం సెప్టెంబర్ 2 రాత్రి పుకాన్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఫుకాన్ తో పాటు అతని మేనేజర్ బిప్లాబ్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరికైనా నాన్ బెయిలబుల్ కేసు కింద కేసులు నమోదు చేశారు.
పుకాన్ మోసాల కేసుతో అన్ని ట్రేడింగ్ మోసాల పై సమగ్ర విచారణకు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆదేశించారు.