యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 23 మంది వలస కూలీలు మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 23 మంది వలస కూలీలు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఇవాల(శనివారం) ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కూలీలు చనిపోయారు. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వస్తుండగా… ఔరయ జాతీయ రహదారిపై తెల్లవారుజామున:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.