నవంబర్ 28న నిట్‌‌ కాన్వొకేషన్

నవంబర్ 28న నిట్‌‌ కాన్వొకేషన్

హనుమకొండ సిటీ, వెలుగు : వరంగల్ నిట్‌‌లో శుక్రవారం 23వ కాన్వకేషన్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్‌‌ సుబూధి చెప్పారు. గురువారం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ... కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైక్రాన్‌‌ ఇండియా ఎండీ ఆనందమూర్తి, గౌరవ అతిథిగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌‌మెంట్‌‌ ఆర్గనైజేషన్‌‌ చైర్మన్‌‌ సమీర్ వి కామత్‌‌ హాజరుకానున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్లకు పట్టాలు అందించనున్నట్లు చెప్పారు. అలాగే ముగ్గురు డైరెక్టర్ గోల్డ్ మెడల్, ఎనిమిది మంది రోల్ ఆఫ్ హానర్ గోల్డ్ మెడల్‌‌తో పాటు బెస్ట్ బీటెక్ ప్రాజెక్ట్‌‌, బెస్ట్ ఎంటెక్ డిస్సర్టేషన్, బెస్ట్ పీహెచ్‌‌డీ అవార్డు అందించనున్నట్లు పేర్కొన్నారు.