
- నాలుగు రాష్ట్రాల్లో ఈగల్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్లు,
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని ముంబైతోపాటు, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో తెలంగాణ ఈగల్ ఫోర్స్ (ఎలైట్‌యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. నైజీరియన్ల డ్రగ్స్ దందాలో వెలుగు చూసిన హవాలా నెట్‌వర్క్‌ను ఛేదించింది. 14 మంది హవాలా వ్యాపారులుసహా మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకుంది. కోట్ల రూపాయల్లో నగదు కూడా స్వాధీనం చేసుకుంది. నిందితులను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లో మూడు కేసుల్లో పట్టుబడిన నైజీరియన్ డ్రగ్స్ సప్లయర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ దందాలో సంపాదిస్తున్న సొమ్మును హవాలా రూపంలో దేశం దాటిస్తున్నట్టు గుర్తించామని ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు. గత 15 రోజులుగా ముంబై, పుణె, గోవా, గుజరాత్‌లో నైజీరియన్లు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి14 మంది హవాలా వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సెర్చ్ ఆపరే షన్లు కొనసాగుతున్నాయన్నారు.