చెట్లు నరికినందుకు రూ.24 లక్షల జరిమానా

చెట్లు నరికినందుకు రూ.24 లక్షల జరిమానా
  •     విద్యుత్​ ఆఫీసుకు సిద్దిపేట  మున్సిపల్ శాఖ నోటీసులు 
  •     నరికిన వాటి స్థానంలో 400  మొక్కలు నాటాలని ఆదేశాలు  

సిద్దిపేట టౌన్, వెలుగు :  ముందస్తు అను మతి లేకుండా కరెంట్​ తీగలకు అడ్డుగా ఉన్నాయని చెట్లు నరికినందుకు విద్యుత్​శాఖకు..సిద్దిపేట మున్సిపల్​అధికారులు రూ.24 లక్షల జరిమానా విధించారు. సిద్దిపేట విద్యుత్​ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, సిబ్బంది ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కరెంట్​ వైర్లకు అడ్డం వస్తున్నాయని సుమారు 400 చెట్లకు పైగా నరికివేశారు.

ఇందులో హరితహారంలో భాగంగా నాటిన చెట్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ నెల 23న గుర్తించిన సిద్దిపేట మున్సిపల్​ కమిషనర్​ ప్రసన్న రాణి.. విద్యుత్​శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లకు రూ.24 లక్షల జరిమాన విధిస్తున్నట్టు నోటీసు పంపారు. నరికివేసిన చెట్ల స్థానంలో 400 కొత్త మొక్కలను నాటాలని అందులో పేర్కొన్నారు.