
కువైట్ లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం కేరళ రాష్ట్రంలో విషాదం నింపింది. ఈ అగ్ని ప్రమాదంలో 45మంది భారతీయులు మరణించారు. వీరిలో 23మంది కేరళ వాసులు ఉన్నారు. కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్‌లోని మంగాఫ్ బ్లాక్‌లోని ఆరు అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం మొత్తం 49మందిని పొట్టన పెట్టుకోగా వీరిలో 45మంది భారతీయులు కావటం విచారకరం. మిగిలిన వారు పాకిస్తాన్, ఫిలిపినో, ఈజిప్షియన్ మరియు నేపాలీ జాతీయులుగా తెలుస్తోంది .
ఈ ప్రమాదంలో 24మంది కేరళీయులతో పాటు తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా వంటి రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచిన 35 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం ఐదుగురు వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలుస్తోంది.