మూడో రోజు 27 నామినేషన్లు : రోనాల్డ్ రాస్

మూడో రోజు 27 నామినేషన్లు : రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు :  హైద‌‌రాబాద్ జిల్లాలో మూడో రోజు సోమవారం 25 మంది అభ్యర్థులు 27 నామినేషన్లు దాఖ‌‌లు చేశారు. ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు 47 నామినేషన్లు దాఖలు చేశారని హైద‌‌రాబాద్ జిల్లా ఎన్నిక‌‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌‌మిష‌‌న‌‌ర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల నామినేషన్ వేశారు. 

రంగారెడ్డి జిల్లాలో 19 నామినేషన్లు..

రంగారెడ్డి కలెక్టరేట్ :  రంగారెడ్డి జిల్లాలో సోమవారం 18 మంది 19 నామినేషన్లను దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నంలో నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా దండెం రాంరెడ్డి నామినేషన్​ వేశారు.