కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం భవానీనగర్లో శ్రీవినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 25 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 35 ఏండ్లుగా భవానీనగర్లో గణేశ్ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 14 ఏండ్లుగా ఇక్కడ భారీ మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు.
35వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి 25 అడుగుల్లో ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రులు పూజల అనంతరం మండపంలోనే నిమజ్జనం చేస్తామని యువజన సంఘం అధ్యక్షుడు శీలం వీరేందర్ తెలిపారు.