3న జడ్చర్లకు సీఎం రాక : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

3న జడ్చర్లకు సీఎం రాక : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  •     బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణలో  ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

 జడ్చర్ల టౌన్​, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఫిబ్రవరి 3న జడ్చర్లకు రానున్నారని ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 3న పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి రానున్నారని  ఆయన వెల్లడించారు.  

గురువారం హైస్కూల్ శతాబ్ది ఉత్సవ కమిటీ రూపొందించిన లోగోను  క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.  హైస్కూల్ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఐఐఐటీ శంకుస్థాపన చేస్తారన్నారు.  సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్, వర్కింగ్​ ప్రెసిడెంట్ వి.కృష్ణ, ప్రధానకార్యదర్శి రమణాచార్యులు, ఆహ్వనకమిటీ సభ్యులు ఎంఈఓ మంజులాదేవి, గోవింద్ నాయిక్ పాల్గొన్నారు. 

జడ్పీ హైస్కూల్​ ను  సందర్శించిన కలెక్టర్​ 

సీఎం రానున్న నేపథ్యంలో   ఏర్పాట్లపై  స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్​ విజయెందిర బోయి బసమీక్షించారు. అత్యవసర సమస్యలు,   తీసుకోవల్సిన చర్యల పై మాట్లాడారు. తాగునీటీ సమస్య, బోరు మోటరుతో పాటు పాఠశాల ప్రహరీ గోడ నిర్మా ణం, పాఠశాలకు పేయింటింగ్​ వేయించాలని ఉత్పవ కమిటి సభ్యులు కలెక్టర్​కు విన్నవిం చారు.  వీటిపై అధికారులు ఈ నెల 20లోగా   చర్యలు తీసుకోవాలని    ఆదేశిం చారు.