ఆర్మీ టెక్నికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల.. ఇంజినీరింగ్ చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

ఆర్మీ టెక్నికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల.. ఇంజినీరింగ్ చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

ఇండియన్ ఆర్మీ షార్ట్ సెలెక్షన్ కమిషన్ (SSC) టెక్నికల్ 67వ కోర్సులో ప్రవేశాలకు పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నది. ఏదైనా స్ట్రీమ్​లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల వారు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 2026, ఫిబ్రవరి 05.  

ఖాళీలు: 350. 

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 75, కంప్యూటర్ సైన్స్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర ఇంజినీరింగ్ విభాగాలు 17. 

ALSO READ : NIT వరంగల్ ఉద్యోగ నోటిఫికేషన్..

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు. అయితే, 2026, అక్టోబర్ 1వ తేదీ లోపు ఇంజినీరింగ్​లో అన్ని సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. 

వయోపరిమితి: 2026, అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1999, అక్టోబర్ 01 నుంచి 2006, సెప్టెంబర్ 30 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

ALSO READ : ఇంటర్ అర్హతతో CLWలో కల్చరల్ కోటా పోస్టులు..

అప్లికేషన్ ప్రారంభం: 2026, జనవరి 07. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: 2026, ఫిబ్రవరి 05.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్టింగ్, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

షార్ట్​లిస్ట్: 2026, మార్చి మొదటివారం.

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: 2026, ఏప్రిల్ – జూన్.

శిక్షణా సమయం: 2026, అక్టోబర్ నుంచి 2027, సెప్టెంబర్ వరకు. 

ట్రైనింగ్: బిహార్ రాష్ట్రం గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాలపాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాలో సర్వీసులోకి తీసుకుంటారు. 

ALSO READ : PGIMERలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు..

పూర్తి వివరాలకు  www.joinindianarmy.nic.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

షార్ట్​లిస్టింగ్: ఫైనల్ సెమిస్టర్/ చివరి ఏడాది వరకు అభ్యర్థులు పొందిన మార్కుల సగటు శాతం ఆధారంగా అప్లికేషన్లు షార్ట్​లిస్ట్ చేస్తారు.  ఖాళీల సంఖ్య ఆధారంగా  ప్రతి ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు కటాఫ్  వేర్వేరుగా ఉంటుంది.

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ:  ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), జలంధర్ కంట్ (పంజాబ్)లోని సెలెక్షన్ సెంటర్లలో ఏదైనా ఒక దానిలో రెండు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపిక ప్రక్రియకు గరిష్టంగా ఐదు రోజుల సమయం పడుతుంది.

మెడికల్ ఎగ్జామినేషన్: ఎస్‌ఎస్​బీ స్టేజ్-2 తర్వాత సిఫారసు చేసిన అభ్యర్థులు వైద్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

తుది మెరిట్ జాబితా: ఎస్‌ఎస్​బీ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్/ సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.