ప్రతి స్కూళ్లో 100 మంది పిల్లలకు ఒక సైకాలజిస్ట్.. కులం,మతం పేరుతో వేధిస్తే కఠిన చర్యలు

ప్రతి స్కూళ్లో 100 మంది పిల్లలకు ఒక సైకాలజిస్ట్.. కులం,మతం పేరుతో వేధిస్తే కఠిన చర్యలు

ఇకపై స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ‘టాపర్స్ బ్యాచ్’.. ‘డల్ బ్యాచ్’ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి, వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల ‘సెక్షన్ల దందా’కు సర్కార్ చెక్ పెట్టింది. 

వంద మందికొక సైకాలజిస్ట్ ఉండాల్సిందే..

రాష్ట్రంలోని వంద మంది లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రతి స్కూల్, కాలేజీ, హాస్టల్ తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ లేదా సోషల్ వర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించుకోవాల్సి ఉంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే, బయట ఉండే మానసిక వైద్యులతో ఒప్పందం కుదుర్చుకోవాలి. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది కౌన్సిలర్లను నియమించుకోవాలి. పరీక్షల టైమ్​లో, అకడమిక్ మార్పుల టైమ్​లో విద్యార్థులకు అండగా ఉండేందుకు చిన్న గ్రూపులకు ప్రత్యేక మెంటార్లను కేటాయించాలని గైడ్​లైన్స్ లో పేర్కొన్నారు. 

కులం, మతం పేరుతో వేధించొద్దు.. 

విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఎల్జీబీటీక్యూ+, దివ్యాంగులు, అనాథ పిల్లలపై ఎలాంటి వివక్ష చూపొద్దని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. కులం, మతం పేరుతో వివక్ష లేకుండా చూసుకోవాలన్నారు. ర్యాగింగ్, లైంగిక వేధింపులు, కుల వివక్షపై వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి కమిటీ వేయాలని.. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే.. వారిని తిరిగి వేధించకూడదని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేస్తే, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్, పర్సనాలిటీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఎగ్జామ్స్ విధానాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని, పిల్లలపై బరువు తగ్గించేలా చూడాలని సూచించారు. కేవలం మార్కులు, ర్యాంకులే జీవితం కాదనే భావన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.