ధర్మారం, వెలుగు : విషపు మేతను తిని గొర్రెలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఈర్ల మల్లయ్య, మట్టే తిరుపతి, అచ్చె రాజయ్య, అచ్చె చంద్రయ్య తమ గొర్రెల మందలను గురువారం ఊరు శివారులో కోసిన వరి పొలాల్లో మేపారు. పురుగు మందు అవశేషాలు వరి మెదల్లో ఉండడంతో వాటిని తిన్న గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. శుక్రవారం ఉదయం 25 గొర్రెలు మృతి చెందాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సమాచారం అందడంతో జిల్లా వెటర్నరీ అధికారి విజయ భాస్కర్, ధర్మారం మండల వెటర్నరీ అధికారి అజయ్ కుమార్ మిగతా గొర్రెలను పరిశీలించి టీకాలు వేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
