
హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఆఫీసులో మంగళవారం భారీ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వచ్చారు. ఈ సెంటర్ కోపైలెట్స్, వివిధ ఏఐ అప్లికేషన్‌లు వంటి ఉత్పత్తులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
అంతేగాక అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్‌తో సహా కీలకమైన మైక్రోసాఫ్ట్ ఆఫర్ల డెవెలప్మెంట్కు ఐడీసీ ఎంతో దోహదపడింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను మెరుగుపరచడానికి, కొత్త వాటిని డెవెలప్చేయడానికి ఏఐ, ఎల్ఎల్ఎంలను ఉపయోగిస్తామని ఐడీసీ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల కోసం మైక్రోసాఫ్ట్ 365 (మొబైల్) అప్లికేషన్లను తయారు చేయడంలో ఎంతో సహకారం అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన అజూర్ కోసం మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఐడీసీ ముందున్నది.