న్యూఢిల్లీ: ఆటో కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2027 చివరి నాటికి 180 కిలోవాట్ల సామర్థ్యం గల 250 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంగళవారం (నవంబర్ 25) తెలిపింది.
ఈ నెట్‌వర్క్‌లో 250 స్టేషన్లలో 1,000 చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. బెంగళూరు – చెన్నై హైవేపై హోస్కోట్ వద్ద, ఢిల్లీ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్‌హెచ్–44 పై మూర్తల్ వద్ద రెండు చార్జింగ్స్టేషన్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని కంపెనీ సీఈఓ (ఆటోమోటివ్ డివిజన్) నళినీకాంత్ గొల్లగుంట అన్నారు. వీటిలో రెస్టారెంట్లు, కేఫ్‌ల వంటి సౌకర్యాలూ ఉంటాయని ఆయన వివరించారు.
