రైస్ మిల్లు దోపిడి : 250 క్వింటల్లా పీడీఎస్ బియ్యం పట్టివేత..

రైస్ మిల్లు దోపిడి : 250 క్వింటల్లా పీడీఎస్ బియ్యం పట్టివేత..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురంలో రాధిక రైస్ మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. అక్రమంగా నిలువ ఉంచిన 250 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. మఠంపల్లి 25మండలం అల్లిపురం గ్రామానికి చెందిన రాధిక రైస్ మిల్లు బిజినెస్ మాన్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. 

ఈ స్పెషల్ డ్రైవ్ హుజూర్ నగర్ పోలీసులు మఠంపల్లి పోలీసులు, సివిల్ సప్లై అధికారులు సమ్యుక్తంగా దాడి చేశారు. లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.