సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ మేయర్

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ మేయర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేశారని కంప్లైయింట్ చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ తో  పాటు తన తనను ట్రోల్స్ చేస్తూన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేయర్ విజయలక్ష్మీ. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో.. వివరాలతో  హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‪ఐఆర్ నమోదు చేశారు. 

ALSO READ | ప్రొటోకాల్ రగడ : అలిగి.. ఆలయం బయట కూర్చున్న మంత్రి పొన్నం