ఉన్న జాబు పాయె..కొత్త‌ కొలువు రాకపాయె

ఉన్న జాబు పాయె..కొత్త‌ కొలువు రాకపాయె

ఆందోళనలో 259 ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లు
శిక్షణనిచ్చి పోస్టింగ్ మరచిన రాష్ట్ర సర్కారు
ఎస్సై, ఎఫ్‌ఆర్వోలాంటి జాబ్స్ ‌వదులుకున్నక్యాండిడేట్లు
అడ్‌హక్‌ ప్రమోషన్స్‌తోనే అసలు సమస్య?

నాలుగేళ్ల‌ కిందట పరీక్ష రాశారు. తర్వాత రెండేండ్లు కోర్టుకేసుల క్లియరెన్స్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు 8 నెలల కిందట రిజల్ట్స్ రావడంతో ఆనందపడ్డారు గ్రూప్–2 విజేతలు. ఉన్న జాబులు వదిలేసి వచ్చి డిప్యూటీ తహసీల్దార్ ట్రైనింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు. కానీ 4 నెలలుగా సర్కారు ఆ పోస్టింగ్స్‌ ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల‌తో పాటే గ్రూప్–2 పరీక్ష రాసిన కొందరు అసిస్టెంట్ కమర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ), ఎక్సైజ్ ఇన్‌స్పెక్ట‌ర్, సబ్ రిజిస్ట్రార్ లాంటి 16 కేటగిరీల్లో ఏడాది కిందటే ఉద్యోగాల్లో చేరగా వీళ్లు మాత్రం పోస్టింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఐదేళ్ల ప్రహసనం

గ్రూప్–2 నోటిఫికేషన్ నుంచి ట్రైనింగ్ వరకు ప్రక్రియంతా ఐదేళ్లు ప్రహసనంగా జరిగింది. టీఎస్పీ ఎస్సీ 2015లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి 2016లో పరీక్షలు పెట్టింది. అనుకోని ఘటనలతో కోర్టు కేసులవల్ల రెండేళ్ల పాటు రిజల్ట్స్ విడుదల కాలేదు. చివరకు 2019 అక్టోబర్‌లో రిలీజ్‌ అయ్యాయి. మెరిట్ లిస్టులో ఎంపికైన క్యాండిడేట్లు అధికారుల చుట్టూ తిరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రెయినింగ్‌కు పిలిచారు. దీంతో అప్పటికే జాబ్ చేస్తున్న 40 మంది గవర్నమెంట్ టీచర్లు, 20 మంది ఎస్సైలు, ఐదుగురు కానిస్టేబుళ్లు, 9 మంది ఎఫ్‌ఆర్వో, ఏడుగురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు ఎంపీడీఓలు, 20 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇలా అనేక మంది తమ జాబ్‌లకు రిజైన్ చేసి ట్రైనింగ్ లో చేరారు. ఇక జాజ్‌లో చేరడమే తరువాయి అనుకునే టైమ్‌లో కరోనాతో పాటు సర్కారు నిర్ల‌క్ష్యం వాళ్లకు శాపమైంది.

అడ్‌హక్ ప్రమోషన్స్‌తోనే వల్లే?

రెవెన్యూ శాఖలోని సీనియర్ అసిస్టెంట్లు , ఆర్‌ఐలకు ఉద్యోగ సంఘాల ఒత్తిడి, ఇతర కారణాలతో డిప్యూటీ తహసీల్దార్లుగా కోటాకు మించి అడ్‌హక్ ప్రమోషన్స్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో డైరెక్ రిక్రూటీలకు సరిపోను శాంక్షన్ పోస్టులు ఖాళీ లేవని, వీళ్ల‌కు పోస్టింగ్ ఇస్తే వాళ్ల‌కు రివర్ష‌న్ ఇవ్వాల్సి వస్తుందని భర్తీలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం