Telusu Kada OTT Release: సిద్ధు 'తెలుసు కదా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డ్ టైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

Telusu Kada OTT Release: సిద్ధు 'తెలుసు కదా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డ్ టైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'తెలుసు కదా'.  అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుని ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని.. రికార్డు సమయంలో ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

ఈ 'తెలుసు కదా'  మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తొలుత ఈ సినిమా నవంబర్ 23న స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ, అంచనా వేసిన తేదీ కంటే ముందే అంటే నవంబర్ 14 తేదీల్లో సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే, థియేటర్లలో విడుదలైన కేవలం నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.

 

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ 

దర్శకురాలు నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ), అంజలి (రాశీ ఖన్నా)ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అతడు తన మాజీ ప్రేయసి అయిన రాగ (శ్రీనిధి శెట్టి)ను ఎదురవుతుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని, చిక్కుముడులు విడదీయలేని విధంగా మారడం ఈ సినిమా ప్రధానాంశం.

►ALSO READ | Gatha Vaibhavam Trailer: ఆషికా రంగనాథ్‌ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్.. గ్రాండ్ విజువల్స్తో ట్రైలర్ అదిరింది

ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో రావడంతో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకుంది. చాలా మంది సినిమా కథ, ఎగ్జిక్యూషన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా, సిద్ధు నటనకు మాత్రం అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. సాధారణ తెలుగు సినిమా ఫార్మాట్‌కు ఇది పూర్తిగా భిన్నమైన చిత్రం. సంక్లిష్టంగా, గందరగోళంగా ఉన్నప్పటికీ, కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్ వద్ద వసూళ్లు..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించబడిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. సినీ ట్రెడ్ వర్గాల సమాచారం మేరకు దేశీయంగా రూ. 8.18 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, లేదా మళ్లీ చూడాలనుకునే సినీ ప్రియులు ఇకపై నవంబర్ 14 తేదీ నుంచి ఎప్పుడైనా నెట్‌ఫ్లిక్స్‌లో హాయిగా చూసే అవకాశం దొరికింది.