Gatha Vaibhavam Trailer: ఆషికా రంగనాథ్‌ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్.. గ్రాండ్ విజువల్స్తో ట్రైలర్ అదిరింది

Gatha Vaibhavam Trailer: ఆషికా రంగనాథ్‌ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్.. గ్రాండ్ విజువల్స్తో ట్రైలర్ అదిరింది

SS దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘గత వైభవ’. ఎపిక్ ఫాంటసీ డ్రామాగా సుని దర్శకత్వం వహిస్తూ దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మించారు. సోమవారం (Nov10న) కన్నడతోపాటు తెలుగులోనూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘హిస్టరీ, మైథాలజీ, సనాతన ధర్మ లాంటి అంశాలను కలగలిపి’ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుత పరిస్థితులకు మైథాలజీని లింక్ చేస్తూ చూపించిన విజువల్స్ క్యూరియాసిటీని పెంచాయి. గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ మంచి బజ్‌‌ని క్రియేట్ చేశాయి. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.

ఎవరీ ఆషికా రంగనాథ్:

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌‌‌‌లో దూసుకెళుతోంది ఆషికా రంగనాథ్. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’లో నటిస్తుంది. కార్తి సర్దార్ 2తో పాటుగా రవితేజ సినిమాలోనూ ఛాన్స్ అందుకున్నట్టు సమాచారం.

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అనార్కలి’ అనే టైటిల్‌‌‌‌ పరిశీలనలో ఉంది. ఇక కళ్యాణ్​రామ్‌‌‌‌కు జంటగా ‘అమిగోస్‌‌‌‌’తో టాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్.. ఆ తర్వాత నాగార్జునకు జంటగా ‘నా సామిరంగ’తో ఆకట్టుకుంది.