CMantham: క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘Cమంతం’.. గర్భిణీల దాడులపై తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్..

CMantham: క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘Cమంతం’.. గర్భిణీల దాడులపై తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్..

వజ్రయోగి, శ్రేయ భర్తీ జంటగా సుధాకర్ పాణి దర్శకత్వంలో టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘సీమంతం’. ఈ శుక్రవారం (నవంబర్ 14న) సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌లో వజ్రయోగి మాట్లాడుతూ ‘ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రాబోతున్న ఈ సినిమా అందరికీ  నచ్చుతుందని నమ్ముతున్నా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌‌‌‌గా ఉంటాయి. ఎస్ సుహాస్ అందించిన సంగీతం, అమర్ గారి ఎడిటింగ్ గ్రిప్పింగ్‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు.

ఒక మంచి సినిమాతో లాంచ్ అవుతున్నందుకు సంతోషంగా ఉందని హీరోయిన్ శ్రేయ భర్తీ చెప్పింది. దర్శకుడు సుధాకర్ పాణి మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాత,  హీరో వజ్రయోగి నా ఫ్రెండ్. నా కాలేజ్ ఫ్రెండ్‌‌‌‌ను నేను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం థ్రిల్లింగ్‌‌‌‌గా ఉంటుంది’ అని అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్, సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్ గాయత్రి సౌమ్య పాల్గొన్నారు. 

సీమంతం వేడుక:

సీమంతం అనేది హిందూ సాంప్రదాయంలో ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకు చేసే ఒక ముఖ్యమైన వేడుక. సాధారణంగా ఏడవ నెలలో లేదా 9వ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్త్రీకి కొత్త బట్టలు పెట్టి, గాజులు తొడిగి ఇలా కుటుంబ సభ్యులు గ్రాండ్ గా చేస్తారు. ఇటీవలే రిలీజ్ చేసిన ‘సీమంతం’ లుక్, టీజర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

►ALSO READ | Dude OTT Official: ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఒక చీకటి గది, అందులో ప్రెగ్నెంట్ మహిళ చేతులు వెనక్కి కట్టి ఉండటం, చేతులకి రక్తం, చుట్టూరా కత్తులు, ఒక పళ్లెంలో కుంకుమ, గాజులు, అక్షింతలు.. ఇలా ప్రతీదీ సస్పెన్స్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆసక్తి రేపే థ్రిల్లర్ అంటే ఇది భయ్యా.. అంటూ సినీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.