హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో మరోసారి ఆడియన్స్కి తెగనచ్చేసాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన డ్యూడ్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి శభాష్ అనిపించుకుంది. ఈ క్రమంలో ‘డ్యూడ్’ ఓటీటీ రాకకోసం సినీ ఆడియన్స్ మాత్రమే కాదు విశ్లేషకులు సైతం ఎదురుచూస్తున్నారు.
2025 అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన డ్యూడ్.. ఇపుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 14 నుంచి డ్యూడ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇవాళ సోమవారం (నవంబర్ 10న) వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డ్యూడ్ మూవీ అందుబాటులో ఉండనుందని పోస్టర్ ద్వారా తెలిపింది. ఇక డ్యూడ్ శాటిలైట్ హక్కులను 'Zee' సంస్థ సొంతం చేసుకోగా... 'జీ తెలుగు'లో ప్రీమియర్ కానుంది.
Orey oru Dude, oraayiram problems, zero solutions 🤭😭 pic.twitter.com/ShfAo36IJz
— Netflix India South (@Netflix_INSouth) November 10, 2025
హ్యాట్రిక్ హీరోగా..
ప్రదీప్ రంగనాథన్ తొలి చిత్రం లవ్ టుడే (Love Today). తన స్వీయ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆయన రెండవ చిత్రం ఏకంగా డ్రాగన్ (Dragon) రూ. 150 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూడవ చిత్రండ్యూడ్ (Dude) ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అధిగమించింది.
సందేశం, వినోదం మేళవింపు..
'డ్యూడ్' కేవలం కామెడీ, రొమాన్స్ మాత్రమే కాక, కులాంతర వివాహాలు, పరువు హత్యలు వంటి సున్నితమైన సామాజిక అంశాలతో పాటు యువతను ఆలోచింపజేసే బలమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రదీప్ తనదైన కామెడీ టైమింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలను పలికించడంలో చూపిన నైపుణ్యం ప్రేక్షకులను కట్టిపడేసింది.
