జూబ్లీహిల్స్ ఎన్నిక : 226 పోలింగ్ స్టేషన్ల దగ్గర.. పారా మిలటరీ బలగాల మోహరింపు

జూబ్లీహిల్స్ ఎన్నిక : 226 పోలింగ్ స్టేషన్ల దగ్గర.. పారా మిలటరీ బలగాల మోహరింపు


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం  65 లొకేషన్స్ లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని  జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్  తెలిపారు.  క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పారామిలిటరీ బలగాలు ఉంటాయని చెప్పారు.  పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.  

నియోజక వర్గంలో స్థానికులు తప్ప ఇతరులను బయటికి పంపుతున్నామని తెలిపారు సీపీ ఇక్వాల్.  హోటల్స్, హాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని చెక్ చేసి ఇతరులను నియోజకవర్గం నుంచి పంపించేస్తున్నామని చెప్పారు.  ఒకవేళ ఇతరులు నియోజకవర్గంలో ఉంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదన్నారు. 1,761 లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. 8 కంపెనీల CISF బలగాలు బందోబస్తులో ఉంటాయని చెప్పారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు అమర్చుతున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర నిరంతరం డ్రోన్లతో  వెబ్ కాస్టింగ్ లైవ్ లో పర్యవేక్షిస్తామని తెలిపారు సీపీ.

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ నవంబర్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 4లక్షల ఒక వేయి మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత,బీజేపీ నుంచి లంకల దీపక్ పోటీ చేస్తున్నారు.