అమెరికాలో తెలుగు విద్యా్ర్థి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. టెక్సాస్ లో ఒక అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉండటం కలకలం రేపింది. టెక్సాస్ యూనివర్సిటీలో ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యార్లగడ్డ రాజ్యలక్ష్మిగా గుర్తించారు. ఇటీవలే జాబ్ లో కూడా జాయిన్ అయినట్లు ఆమె ఫ్రండ్స్ చెప్పారు.
2025 నవంబర్ 07 న రాజ్యలక్ష్మీ చనిపోయిందని ఆమెన్ సోదరుడు చైతన్య తెలిపాడు. గత మూడు రోజులుగా దగ్గు, చెస్ట్ పెయిన్ ఉన్నట్లు చెప్పాడు. నవంబర్ 07న ఉదయం నిద్ర లేవుకుండా బెడ్ పైనే పడిఉందని పోలీసులకు వివరించారు. ఆమె మృతికి కారణం తెలుసుకునేందుకు పోలీసులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు.
►ALSO READ | తిరుమల: అలిపిరి మెట్ల మార్గంలో చేపల కూర తిన్న ఉద్యోగులు.. తొలగించిన టీటీడీ
ఛాతినొప్పి, దగ్గుతో చనిపోయినట్లు ఫ్రెండ్స్ చెబుతున్నప్పటికీ.. పూర్తి వివరాలు తెలియాలంటే మెడికల్ రిపోర్టు రావాలని స్థానిక పోలీసులు చెబుతున్నారు. రాజ్యలక్ష్మిది ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కర్మెచెడు గ్రామం. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
