తిరుమల: అలిపిరి మెట్ల మార్గంలో చేపల కూర తిన్న ఉద్యోగులు.. తొలగించిన టీటీడీ

తిరుమల: అలిపిరి మెట్ల మార్గంలో చేపల కూర తిన్న ఉద్యోగులు.. తొలగించిన టీటీడీ

తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో అలిపిరి దగ్గర టీటీడీ ఉద్యోగులు చేపల కూర తిన్న వీడియో వైరల్ మారింది. భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులే నిషేధిత ఆహారం‌ తినడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.  ఈ వ్యవహారంపై సీరియస్ అయిన టీటీడీ.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

టీటీడీ ఔట్సోర్సింగ్ లో పని చేస్తున్న  రామస్వామి , సరసమ్మ అనే ఉద్యోగులు  ఆదివారం (నవంబర్ 09) అలిపిరి వద్ద  మాంసాహారం తిన్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు.  ఈ క్రమంలో ఆ ఇద్దరు ఔట్సోర్సింగ్  ఉద్యోగులపై  తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్ టీటీడీ.  ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.