ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే బ్రిడ్జిని ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. 22 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ( జూన్ 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిని ఢీకొని బస్సు బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అతివేగంతో వచ్చి బ్రిడ్జిని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికులంతా అద్దాలు పగలకొట్టుకొని స్ బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులంతా మెలుకువగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు.
కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా చెక్కపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అంటున్నారు ప్రయాణికులు.
