హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సచివాల యంలో 26 మంది అధికారులను అంతర్గత బదిలీ చేశారు. అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులను వేరే చోటుకు మార్చారు. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఒకే శాఖలో సంవత్సరాలుగా పాతుకపోయిన అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ ట్రాన్స్ ఫర్స్ చేపట్టారు. బదిలీ అయిన వారిలో అడిషనల్ సెక్రటరీలు ఏడుగురు, జాయింట్ సెక్రటరీలు ఏడుగురు, డిప్యూటీ సెక్రటరీలు12 మంది ఉన్నారు.