కౌన్సిలింగ్ : మీ పిల్లల్లో ఈ సమస్యలు గమనించారా.. వెంటనే సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి.. లేదంటే డేంజర్

కౌన్సిలింగ్ :  మీ పిల్లల్లో ఈ సమస్యలు గమనించారా.. వెంటనే సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి.. లేదంటే డేంజర్

పొస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న సుమ కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చిన దగ్గర్నించీ ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి కాస్తా అందుకు పూర్తిభిన్నంగా మారిపోయింది

అమ్మా నాన్నలతో  మాట్లాడలేదు. స్నేహితులతో కలవడం లేదు. ఎప్పుడూ 
 ఒక్కతే కూర్చొని ఉంటోంది. రాత్రిళ్లు నిద్రపోకుండా ఎంత సేపైనా టీవీ చూస్తూ కూర్చుంటోంది. ఇదివరకు సెలవులకు ఇంటికొస్తే చాలు అమ్మా! షాపింగ్ కు పోదాం అంటూ కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తేది. అలాంటిది. 'వెళ్దాం రా' అని పిలిచినా ఆసక్తి చూపడంలేదు మాట్లాడమని, తినమని, బలవంతం చేస్తేగదిలోకి వెళ్లిపోయి తలుపులు బిగించుకుంటోంది. గంటలకొద్దీ ఒక్కతే ఉంటోంది.

రియాక్టివ్ డిప్రెషన్ :  అలా ఉండడానికి కారణం లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాయలేదని కౌన్సెలింగ్ లో తెలిసింది. దాంతో ర్యాంక్ బాగా తగ్గిపోయింది. ప్రొఫెసర్లు.! ఇంట్లో వాళ్లు  ర్యాంక్​  ఎందుకు తగ్గిపోయిందని అడగడం మొదలు పెట్టారు. ఆ ప్రభావం ఆ అమ్మాయి మనసు మీద పడి నేను సరిగ్గా చదవలేకపోయా' అనే భావన బలంగా నాటుకుపోయి, రియాక్టివ్ డిప్రెషన్ బారిన పడింది. ఇదొక్కటే కాకుండా వేరే కారణాలు కూడా ఉండొచ్చు.

చిన్నయినా.. పెద్దయినా..: డిప్రెషన్ అంటే ఏమిటో అందరికీ స్పష్టంగా తెలియాలి. ఏవయసు వాళ్లకి వస్తుంది. కారణాలేంటి అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. చిన్న పిల్లలకు డిప్రెషన్ ఏంటి? అనుకుంటారు. కానీ వాళ్లకూ ఉంటుంది. డిప్రెషన్ కు మెదడులో రసాయన మార్పులు, హార్మోన్ల స్థాయిలో తేడా, థైరాయిడ్ గ్రంధి పనితీరు కారణాలవుతాయి. దీన్ని ఎండోజిషన్ అంటారు. వారసత్వంగా ఉండే దాన్ని జెనెటిక్ ప్రి డిస్ పొజిషన్ అంటారు. ఇక్కడ చెప్పిన కేసులో సుమకు 'రియాక్టివ్ డిప్రెషన్' ఒక పరిస్థితి లేదా సంఘటన దీనికి దారి తీస్తుంది.

►ALSO READ | అమ్మా .. ఇవి తింటే చాల బలం వస్తుందట .. కమ్మగా ఉంటాయి.. చేసిపెట్టవా..!

ఇలా కనుక్కోవచ్చు

  • స్కూల్ వెళ్లకపోవడం, నిద్రపోకపోవడం, హోంవర్క్ మీద దృష్టి పెట్టకపోవడం, మిగతా పిల్లలతో కలవకపోవడం వంటి లక్షణాలు పిల్లలోకనిపిస్తే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి ప్రొఫెషనల్ సాయం తీసుకోవాలి.
  •  టీనేజర్స్​ లో  హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఊహించుకుంటారు. ఉదాహరణకు ఫ్రెండ్ తనకు చెప్పకుండా మరొక ఫ్రెండ్ తో బయటకు వెళ్తే నా ఫ్రెండ్​ కు నాతో ఉండడం కష్టం లేదనుకోవడం వంటివి.
  •  తల్లిదండ్రులు ఈ డ్రెస్ బాగోలేదు వేరేది వేసుకోమని చెప్తేనో, క్లాసులో అబ్బాయి లేదా అమ్మాయి తన మీదజోక్ వేశారనో, మాట్లాడలేదనో.. "నేను అందంగా లేను'. 'నేను ఎవరికి నచ్చను' అంటూ - కంక్లూజన్ కువచ్చేస్తారు.
  •  అనుకున్నట్లు మార్కులు రాలేదని, అందంగా లేనని ప్రేమ ప్రయత్నాలు విఫలం), ఎంట్రన్స్ పరీక్ష క్లియర్ కాలేదనే కారణాలతో డిప్రెషన్ బారిన పడుతుంటారు.

అశ్రద్ధ చేయొద్దు

  •  ఈ లక్షణాలున్న వాళ్లను చూసి కుటుంబ సభ్యులు, టీచర్లు, స్నేహితులు బద్దకిస్తున్నాడు అనుకునే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ లక్షణాలు రెండు మూడు వారాలకంటే ఎక్కువ కనిపిస్తే ఆశ్రద్ధ చేయొద్దు. అవసరమైతే ప్రొఫెషనల్స్ దగ్గరకు తీసుకెళ్లాలి.
  • ఆడవాళ్లకు నెలసరి సమయంలో ప్రసవం తరువాత, మెనోపాజ్ అప్పుడు. డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యి పెళ్లి ళ్లు  చేసుకుని వేరుగా వెళ్లిపోవడం వల్ల తల్లిదండ్రులకు 'ఎంప్టీ నెస్ట్' సిండ్రోమ్ ఉంటుంది.

అడ్జస్ట్​ మెంట్​ ప్రాబ్లమ్: మ్యారేజీ కౌన్సెలింగ్​కు వచ్చే వాళ్లలో ఎక్కువమంది మా బందం చిక్కుల్లో ఉందని రారు. డిప్రెషన్ ఉందనే వస్తారు. దాన్నుంచి బయటపడే మార్గాలు బోలెడు. డిప్రెషన్ అనేది రోగమో... శాపమోకాదు. ఒక సమస్య మాత్రమే. కౌన్సెలింగ్, సైకోథెరపీల ద్వారా అవసరమైతే సైకియాట్రిస్టులు ఇచ్చే మందుల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..

-వెలుగు,లైఫ్​–