కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం ( జనవరి 3 ) స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న అంటే తనకు సెంటిమెంట్ అని, అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అభివృద్ధికి తన వంతు సాయం ఉంటుందని.. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ కూడా సహకరిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్.
గతంలో అంజన్న దర్శనానికి వచ్చినప్పుడు వసతి గృహాలకు సహాయం చేయాలని తనను అడిగారని.. టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యుల సహకారంతో అవసరమైన నిధులు ఇప్పించానని అన్నారు పవన్. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.
కొండగట్టు గిరిప్రదక్షిణ అంశాన్ని మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన దృష్టికి తెచ్చారని.. గిరిప్రదక్షిణకు సాయం చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్.అంజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అంజన్న ఆశీస్సులు ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్.
