భార్య మగాడని తెలిసి విడాకులు..పెండ్లైన 12 రోజులకు బయటపడ్డ నిజం

భార్య మగాడని తెలిసి విడాకులు..పెండ్లైన 12 రోజులకు బయటపడ్డ నిజం

జకర్తా: సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై చాటింగ్, అప్పడప్పుడు మీటింగ్. ఇలా ఏడాదిపాటు ప్రేమలో గడిపాక పెండ్లితో ఒక్కటయ్యారా యువతీయువకుడు. ఆమె అనాథ, ముస్లిం కావడంతో సాదాసీదాగా నిఖా చేసుకున్నారు. ఆపై 12 రోజులు గడిచినా.. ఆమె ఇంట్లోనూ బురఖా తీయకుండా ముఖం చాటేస్తుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. విషయం ఏంటో తేల్చేద్దామని నిలదీయడంతో.. ఆమె మహిళ కాదని, మగాడని తేలిపోయింది. తాను మోసపోయానం టూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇండోనేసియాలో నెల కింద జరిగిన ఈ ఘటన గురించి చైనా పోస్ట్ మంగళవారం కథనం రాయడంతో వైరల్ అయింది. 

జావా ద్వీపంలోని నరింగుల్​కు చెందిన ఏకేకు సోషల్ మీడియా ద్వారా 26 ఏండ్ల అడిండా కాన్జా 2023లో పరిచయమైంది. ఆపై అప్పుడప్పుడూ మీట్ అయ్యారు. ఆమె ముస్లిం కావడంతో మత సాంప్రదాల ప్రకారం హిజాబ్ తీయట్లేదని భావించాడు. పెండ్లయ్యాక కూడా ఇంట్లోవాళ్లకు, తనకు ముఖం చూపించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఆమె గురించి ఆరా తీశాడు. తీరా విషయం బయటపడ్డాక ఆమె అనాథ కాదని, తల్లిదండ్రులు కూడా ఉన్నారని గుర్తించాడు. నిందితుడు డబ్బులు గుంజేందుకు 2020 నుంచి ఆడవాళ్ల వేషంలో తిరుగుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అతడు మాట్లాడే తీరు, గొంతు అచ్చం అమ్మాయిలా ఉందని, ఎవ్వరికీ అనుమానం వచ్చే చాన్సే లేదని పోలీసులు వెల్లడించారు.