27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌‌‌‌లో 27 మంది మంత్రులపై క్రిమినల్‌‌‌‌ కేసులు ఉన్నాయి. వారిలో 18 మంది సీరియస్‌‌‌‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎలక్షన్స్‌‌‌‌ టైంలో ఎన్నికల కమిషన్‌‌‌‌కు ఇచ్చిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఎన్నికల్లో పోటీ చేయనందున ఆయన వివరాలు తెలియలేదు. ఆడ్వకసీ గ్రూప్‌‌‌‌ అసోసి యేష్‌ ఆఫ్‌‌‌‌ డెమోక్రటిక్‌‌‌‌ రిఫామ్స్‌‌‌‌ (ఏడీఆర్‌‌‌‌‌‌‌‌) ఈ మేరకు రిపోర్ట్‌‌‌‌ రిలీజ్‌ చేసింది. శివసేన , ఎన్సీపీ ,కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో ని 42 మంది మినిస్టర్లలో 41మంది కోటీశ్వరులని రిపోర్ట్‌‌‌‌ తెలిపింది. వారి యావరేజ్‌ ఆస్తులు రూ.22 కోట్లు. కాంగ్రెస్‌‌‌‌కు చెందిన విశ్వజిత్‌‌‌‌ కాదమ్‌ రూ.217 కోట్ల ఆస్తితో మొదటి ప్లేస్‌‌‌‌లో ఉన్నారు.