27 మంది స్టూడెంట్లకు ఫుడ్​ పాయిజనింగ్

27 మంది స్టూడెంట్లకు ఫుడ్​ పాయిజనింగ్

రామాయంపేట, వెలుగు : మెదక్​జిల్లా రామాయంపేట గవర్నమెంట్​హై స్కూల్​లో ఫుడ్ పాయిజనింగ్​తో 27 మంది స్టూడెంట్స్ అస్వస్థత కు గురయ్యారు. స్కూల్​లో మొత్తం 360 మంది స్టూడెంట్స్ ఉండగా అందులో 203 మంది మంగళవారం మధ్యాహ్న భోజనం తిన్నారు. అన్నంతోపాటు ఆలు, టమాట కర్రీ,  చింతపండు పులుసు నిర్వాహకులు  వడ్డించారు.  అన్నం తిన్న  రెండు గంటల తర్వాత ఒక్కొక్కరుగా స్టూడెంట్స్ వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు.

టీచర్లు వెంటనే స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అన్నం, కూరలు మినరల్​వాటర్​తోనే వండినట్టు నిర్వాహకులు చెప్పారు. ఇలా ఎలా జరిగిందో తెలియదన్నారు. విషయం తెలిసి ఆసుపత్రి వద్ద బీజేపీ లీడర్లు నిరసన తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్​కు గురైన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు 2 గంటలు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఎంఈవో, డీఈవో, మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.