272 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..నిఫ్టీ 74 పాయింట్లు అప్​

272 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..నిఫ్టీ 74 పాయింట్లు అప్​

ముంబై : ఈక్విటీ బెంచ్‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు బుధవారం ఇంట్రా-డే కనిష్ట స్థాయిల నుండి తిరిగి పుంజుకున్నాయి. మార్కెట్ హెవీవెయిట్స్​ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్,  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ షేర్ల ఫాగ్ -ఎండ్ (చివరి గంట) కొనుగోళ్ల మద్దతు ఇందుకు కారణం. సెన్సెక్స్​ 272 పాయింట్లు పెరిగి 71,658 వద్ద స్థిరపడే ముందు లాభనష్టాల మధ్య ఊగిసలాడింది.  నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 21,619 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ కంపెనీల్లో రిలయన్స్  అత్యధికంగా 2.69 శాతం పెరిగింది. హెచ్‌‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో

ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్, విప్రో, టీసీఎస్​,  టైటాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఎన్​టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్,  నెస్లే వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో గ్రీన్‌‌లో స్థిరపడగా, సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా గ్రీన్‌‌లో ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగిశాయి.  ఎఫ్‌‌ఐఐలు  మంగళవారం రూ.990.90 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.   బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌కు 0.19 శాతం తగ్గి 77.44 డాలర్లకు చేరుకుంది.