Bangladesh Unrest: ఆ పార్టీకి చెందిన 29 మంది రాజకీయ నేతలను చంపేశారు

Bangladesh Unrest: ఆ పార్టీకి చెందిన 29 మంది రాజకీయ నేతలను చంపేశారు

బాంగ్లాదేశ్ చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారలేదు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వదిలినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రస్తుతం ఆర్మీ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.ప్రధాని షేక్ హసీనా దేశం నుండి నిష్క్రమించిన తర్వాత జరిగిన దాడుల్లో 29మంది అవామి లీగ్ నేతలు, వారి కుటుంబసభ్యులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటిదాకా ఈ దాడుల్లో 400మందికి పైగా మరణించారు. ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిన తర్వాత వందలాది మంది హిందువుల ఇల్లు, వ్యాపార సంస్థలు , దేవాలయాలు దగ్ధం చేశారు. ఈ ఘటనలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్‌ను ప్రధాన సలహాదారుగా నియమించడంతో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటయింది .