విజయ్ రోడ్ షో తొక్కిసలాట..29కి చేరిన మృతులు..బాధితులతో కిక్కిరిన ఆస్పత్రులు

విజయ్  రోడ్ షో తొక్కిసలాట..29కి చేరిన మృతులు..బాధితులతో కిక్కిరిన ఆస్పత్రులు

తమిళనాడులోని కరూర్​లో భారీ తొక్కిసలాట జరిగింది. శనివారం ( సెప్టెంబర్​27) సాయంత్రం కరూర్ లో టీవీకే చీఫ్​ విజయ్ కార్నర్​ మీటింగ్​లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్యం 29కి చేరింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు,16 మంది మహిళలున్నారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కరూర్​ లోని ఆస్పత్రులకు తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

నామక్కల్​ లో ప్రచారాన్ని ముగించుకొని కర్నూర్​ లో శనివారం రాత్రి 7గంటల తర్వాత కార్నర్​ మీటింగ్​ లో పాల్గొన్నారు. విజయ్​ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో చిక్కుకుని చాలా మంది స్పృహ కోల్పోయారు. వారిని కరూర్​ ప్రభుత్వాస్పత్రికి  తరలించగా 29 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.

శనివారం రాత్రి 9 గంటల నాటికి తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్​య 29 కి చేరిందని రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది. ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.