కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు పోదు

కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు  పోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకండ్ వ్యాప్తి చెందుతోంది. గత వారం రోజులుగా వైరస్ భీకరరూపం దాల్చింది. రోజుకు రెండున్నర లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ తీవ్రత గురించి సౌత్ ఈస్ట్ ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ నీరజ్ కౌశిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడప్పుడే కరోనా అంతమవ్వదని, సెకండ్ వేవ్ 100 రోజుల వరకు కొనసాగుతుందన్నారు.  

‘కరోనా సెకండ్ వేవ్ వంద రోజుల వరకు ఉంటుంది. దేశంలోని 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తవడం, హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకునే వరకు ఇలాంటి మరిన్ని వేవ్స్ వస్తాయి. ఇమ్యూనిటీ ఉన్న వారు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే సామర్థ్యం కొత్త మ్యూటేటెడ్ వైరస్‌కు ఉంది. అందుకే టీకా తీసుకున్న వారికీ కరోనా రావడాన్ని చూస్తున్నాం. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులకు మ్యూటేటెడ్ వైరస్‌‌ను గుర్తించే సత్తా ఉండకపోవచ్చు. కరోనా లక్షణాల్లో వాసనను గుర్తించకపోవడం ప్రధానమైంది. సెకండ్ వేవ్‌లో కరోనా చాలా స్పీడ్‌గా ఇన్ఫెక్ట్ అవుతుంది. కరోనా పాజిటివ్ వ్యక్తికి కాంటాక్ట్ అయిన వారికి 15 నిమిషాల్లోనే వైరస్ సోకుతుంది. ఊబకాయం, మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్, వెజిటబుల్ జ్యూస్‌‌లు, కొబ్బరినీళ్లు లాంటివి తాగుతూ ఉండాలి. మాస్కులు తప్పకుండా కట్టుకోవాలి.