‘హత్య’ మూవీ నుంచి ‘నీకు జ్ఞాపకం ఉన్నదా..

‘హత్య’ మూవీ నుంచి ‘నీకు జ్ఞాపకం ఉన్నదా..

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అంటూ టాలీవుడ్‌‌‌‌కి పరిచయమైన మీనాక్షీ చౌదరి.. ఆ తర్వాత ‘ఖిలాడి’తో కలిసి వచ్చి సందడి చేసింది. ప్రస్తుతం ‘హిట్: ద సెకెండ్‌‌‌‌ కేస్‌‌‌‌’తో పాటు ‘హత్య’ సినిమాలోనూ నటిస్తోంది. నిన్న ‘హత్య’ మూవీ నుంచి ఆమె పాట ఒకటి విడుదలయ్యింది. ‘నీకు జ్ఞాపకం ఉన్నదా.. తుడిపివేసిన యవ్వనం.. చిన్నదే అంటూ జీవితం మరిచావా నన్ను సాంతము’ అని సాగే ఈ పాటను గిరీష్ గోపాలకృష్ణన్ కంపోజ్ చేశాడు. అంజనా రాజగోపాలన్ పాడింది.

ఈ పాట ఎంతో మెలోడియస్‌‌‌‌గా ఉండి ఆకట్టుకుంది. ఓ స్టేజ్‌‌‌‌ మీద మీనాక్షి ఈ పాట పాడుతోంది. వింటేజ్ లుక్‌‌‌‌లో డిఫరెంట్‌‌‌‌గా ఉంది. విజయ్ ఆంటోనీ హీరోగా బాలాజీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒకమ్మాయి మర్డర్ కేస్ చుట్టూ తిరుగుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపిస్తాడు. ఒక హీరోయిన్‌‌‌‌గా మీనాక్షి, మరో హీరోయిన్‌‌‌‌గా రితికా సింగ్ నటిస్తున్నారు. ఇలాంటి మంచి మూవీతో కోలీవుడ్‌‌‌‌లో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉందని, ఈ జర్నీ తనకో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని మీనాక్షి చెబుతోంది.