కరోనా కలకలం.. తమిళనాడులో లాక్ డౌన్

కరోనా కలకలం.. తమిళనాడులో లాక్ డౌన్

భారత్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. పండుగల పబ్బాలు, సభలు, సమావేశాలపై నిబంధనలు పెట్టాయి. ఇప్పటికే పలు చోట్ల నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అయితే ప్రతీ ఆదివారం లాక్ డౌన్ పాటిస్తోంది తమిళనాడు సర్కార్. జనవరి 9 నుంచి ఈ వీకెండ్ లాక్ డౌన్ పాటిస్తోంది. తమిళ నాడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు అంతటా నైట్‌ కర్ఫ్యూ విధించింది సర్కార్‌. దీంతో అన్ని రోజులలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక ఇవాళ ఆదివారం కావడంతో… తమిళనాడులో మళ్లీ లాక్‌ డౌన్‌ అమలులోకి రానుంది. ఇక ఇవాళ కేవలం అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రం స్టాలిన్‌ సర్కార్‌ అనుమతులు ఇచ్చింది. 

నిబంధనల ప్రకారం రెస్టారెంట్లు ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే టేక్ ఎవే సేవలను అందించడానికి అనుమతి కల్పించారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. అత్యావసర  విభాగాలకు చెందిన సిబ్బందికి అనుమతి ఇచ్చారు.  మెట్రో రైలుతో సహా విమానాలు, సబర్బన్ మరియు ఇతర రైలు సర్వీసులు, బస్సు  ఇతర ప్రజా రవాణా సేవలు నిలిపివేశారు. అయితే ఆదివారం లాక్‌డౌన్ సమయంలో ప్రజలు వివాహాలతో సహా కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడానికి అనుమతించబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం వివాహాలకు హాజరయ్యేందుకు 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. లాక్‌ డౌన్‌ ఉన్న నేపథ్యంలో.. ఎవరైనా రూల్స్‌ బ్రేక్‌ చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: 

మెహందీ ఫంక్షన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డ్యాన్స్

ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి లక్షలు కోల్పోయిన మహిళ