ఇషాన్ ఇదే దూకుడును కొనసాగించాలి

ఇషాన్ ఇదే దూకుడును కొనసాగించాలి

ఇంగ్లండ్‌‌తో జరిగిన రెండో టీ20లో భారత్ విక్టరీ కొట్టింది. తొలి మ్యాచ్‌‌లో ఓటమితో ఒత్తిడిలో బరిలోకి దిగిన టీమిండియా.. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌‌లో యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ధనాధన్ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఇషాన్ ఎదుర్కొన్న తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ఇన్నింగ్స్‌‌పై అతడు స్పందించాడు. కెప్టెన్ కోహ్లీతోపాటు హిట్‌‌మ్యాన్ రోహిత్ శర్మ సహకారం వల్లే తాను బాగా ఆడగలిగానని చెప్పాడు. ‘బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఒత్తిడిలో లేను. నేను హాఫ్ సెంచరీ చేరుకున్న విషయం కూడా నాకు తెలియదు. విరాట్ భాయ్ చెప్పడంతో అర్ధ సెంచరీ కొట్టాక బ్యాట్ పైకి లేపా’ అని ఇషాన్ కిషన్ చెప్పాడు. ఇక కిషన్‌‌ను కోహ్లి మెచ్చుకున్నాడు. ఇషాన్‌‌ది భయపడని తత్వమని, అతడు ఇలాగే ఆడాలని సూచించాడు.