
బెల్లంపల్లి, వెలుగు: కరెంట్షాత్తగిలి 3 ఆవులు చనిపోయిన ఘటన శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామంలో జరిగింది. బాధిత రైతులు గోమాస ప్రకాశ్, గోమాస అరుణ్, పట్టి రాజుల వివరాల ప్రకారం... తమ ఆవులు మేత కోసం పొలాల్లోకి వెళ్లాయని, అప్పటికే పొలంలో విద్యుత్ స్తంభం విరిగిపడి ఆ తీగలు తగిలి ఆవులు చనిపోయాయని తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించారు.