మంత్రి బెయిల్కు రూ.3 కోట్లు డిమాండ్

మంత్రి బెయిల్కు రూ.3 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ బెయిల్ ఇప్పించేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం ఆర్థర్ రోడు జైలులో ఉన్న ఆయనను బయటకు తెచ్చేందుకు ఓ వ్యక్తి డబ్బు డిమాండ్ చేసినట్లు నవాబ్ మాలిక కొడుకు అమీర్ మాలిక్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాని ఆధారంగా వీబీ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతియాజ్ అనే వ్యక్తి తన తండ్రికి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ.3 కోట్లు బిట్ కాయిన్ల రూపంలో చెల్లించాలని ఈ మెయిల్ పంపినట్లు అమీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమీర్ కంప్లైంట్పై స్పందించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 419, 420, ఐటీ యాక్ట్లోని వివిధ సెక్షన్ల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత నెల 23న అరెస్ట్ చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయంటూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

కేసీఆర్ అవినీతి పాలనపైనే మా పోరాటం