పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

పంజాబ్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపరుల ఆట కట్టించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా మార్చి 23న యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ప్రారంభించనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. దేశం కోసం భగత్ సింగ్ బలిదానం చేసిన షహీద్ దివస్ నాడు ఫోన్ నెంబర్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పంజాబ్ ప్రజలు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను వాట్సప్ ద్వారా ఈ నెంబరుకు పంపవచ్చని భగవంత్ మాన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అది తన పర్సనల్ వాట్సాప్ నెంబర్ అని.. రాష్ట్రంలో ఎవరైనా లంచం అడిగితే.. వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి దాన్ని తనకు పంపాలని చెప్పారు. అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పంజాబ్లో ఇకపై అవినీతి అనే పదం వినిపించదని అన్నారు.


 
అంతకు ముందు సీఎం భగవంత్ మాన్తో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విధాన సభలో జరిగిన కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ డాక్టర్. ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ వారితో ప్రమాణం చేయించారు.

https://twitter.com/BhagwantMann/status/1504370003470020608?cxt=HHwWgMCruYajzOApAAAA

మరిన్ని వార్తల కోసం..

భజ్జీకి ఆప్ బంపర్ ఆఫర్ 

తెలంగాణ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి