
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఇవాళ(గురువారం) తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజ్ఞాపూర్ దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టింది. మృతులను మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంలో తాండూరు సర్పంచ్ అంజిబాబుతో పాటు అతని స్నేహిుతులు సాయికృష్ణ, గణేష్ చనిపోయారని పోలీసులు చెప్పారు.