ఒక్క పాము.. మూడు కుక్కలు.. ఇంటి ముందు యుద్ధం

ఒక్క పాము.. మూడు కుక్కలు.. ఇంటి ముందు యుద్ధం

పాము.. ఈ మాట వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.. అమ్మో పాము అని అల్లంత దూరం పరిగెడుతాం.. పాము అల్లంత దూరంలో కనిపించినా మనం అయితే గంతులేస్తూ పరిగెడతాం.. అలాంటి పాము ఓ ఇంటి ముందుకు వచ్చింది.. అప్పటికే అక్కడ ఉన్న మూడు కుక్కలు మాత్రం ఆ పాముతో యుద్ధం చేశాయి.. పామును చూసిన కుక్కలు అరుస్తూ.. ముందుకు వెళుతూ.. వెనక్కి వస్తూ.. ఆ పాములతో యుద్ధం చేశాయి. ఇక పాము సైతం కుక్కల అరుపులతో అటూ ఇటూ వెళ్లలేక పడగ ఎత్తి కాటు వేయటానికి ప్రయత్నిస్తూ.. కుక్కలకు ధీటుగా తన ప్రతాపం చూపించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శ్రావష్టి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

శ్రావష్టి గ్రామంలోని ఇకౌనా ప్రాంతంలోని ఓ చిన్న వీధిలో ఓ నాగు పాము వచ్చింది. ఇంటి ముందు ఉన్న పామును చూసి.. ఆ వీధిలోని మూడు కుక్కలు అరవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీధీలోకి వస్తున్న ఓ మహిళ పామును చూసి భయంతో అక్కడే ఆగిపోతుంది.. ఆ పాము పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లలేదు. నడి వీధిలోనే కుక్కలు అరుపులకు అటూ ఇటూ తిరుగుతూ.. బుసలు కొడుతూ.. పడగ విప్పి కుక్కలను భయపెడుతున్నట్లు వీడియోలో కనిపించింది. 

పాము వీధిలోకి వచ్చిన వెంటనే కుక్కలు గమనించటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. లేకపోతే ఆ నాగు పాము ఇంట్లోకి చొరబడి ఎవరైనా కాటు వేసేది.. మూడు వీధి కుక్కలు ఆ పాముపై దాడి చేయటానికి ప్రయత్నించాయి కానీ.. దాడి మాత్రం చేయలేదు. ఇంత వరకు మాత్రమే ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపిస్తున్న మహిళ మత్రం కుక్కల వల్ల పాము బారి నుంచి బయటపడిందనే కామెంట్లు నెటిజన్లు నుంచి వస్తున్నాయి. 

ఆ వీడియో మీరూ చూసేయండీ...