సిద్దిపేటలో పోలీసుల తనిఖీల్లో రూ. 3 లక్షలు పట్టివేత

సిద్దిపేటలో పోలీసుల తనిఖీల్లో రూ. 3 లక్షలు పట్టివేత

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఆదివారం ఇస్లామియా కాలేజ్ చౌరస్తా వద్ద  పోలీసులు రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ కృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 10.30 సమయంలో పట్టణానికి చెందిన సాయి రెడ్డి కారులో ఎలాంటి రశీదు లేకుండా రూ.3 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. 

నగదు, బంగారం తీసుకెళ్లే వారు తప్పకుండా వాటికి  సంబంధించిన ఆధారాలు చూపించాలని సీఐ తెలిపారు.