
దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ‘త్రీ రోజెస్’ సీజన్ 2 త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. కిరణ్ కె కరవల్ల దీనికి దర్శకుడు. టైటిల్‌కు తగ్గట్టుగా ఇందులోని ముగ్గురు హీరోయిన్స్‌ను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్న మేకర్స్.. బుధవారం రాశీ సింగ్ పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
ప్రారంభంలో చీరకట్టుతో ఇంట్లో పూజలు చేస్తూ ట్రెడిషన్‌కు కేరాఫ్‌లా కనిపించిన రాశీ సింగ్.. తర్వాతి సీన్‌లో నైట్ పబ్‌లో ఫుల్‌గా మందేస్తూ ఆశ్చర్యపరిచింది. తన క్యారెక్టర్‌లోని రెండు డైమన్షన్స్‌ను చూపిస్తూ విడుదలైన ఈ టీజర్ ఆసక్తి రేపుతోంది. ఈషా రెబ్బా, కుషిత కల్లపు, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.