లోయలో పడ్డ ఆర్మీ వాహనం..ముగ్గురు జవాన్లు మృతి

లోయలో పడ్డ ఆర్మీ వాహనం..ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 

మే 4న  జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఆర్మీ వాహనం  బ్యాటరీ చష్మా దగ్గరకు రాగానే 700 అడుగుల లోతు లోయలో  పడిపోయింది. జవాన్ల మృతదేహాలు, వారి వస్తువులు ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. 

ఘటనా స్థలానికి వచ్చిన భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు,SDRF బృందం సహాయక చర్యలు చేపట్టాయి.    మృతులు  అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్‌గా గుర్తించినట్లు భారత సైన్యం ప్రకటించింది.