బార్డర్​లో ముగ్గురు టెర్రరిస్టులు హతం

బార్డర్​లో ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్ : నియంత్రణ రేఖ(ఎల్​వోసీ)ని దాటి మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఆదివారం జమ్మూకాశ్మీర్ లోని కేరన్ సెక్టార్ లో ఎల్ వోసీ వద్ద ఈ చొరబాటు యత్నాన్ని భగ్నం చేసినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

టెర్రరిస్టుల వద్ద ఉన్న వెపన్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, యాంటీ ఇన్ ఫిల్ట్రేషన్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. అయితే, భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన ఆ ముగ్గురు  టెర్రరిస్టుల గుర్తింపు వివరాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.