గుజరాత్ పోర్టులో 3 వేల కిలోల డ్రగ్స్ : నేవీకి చిక్కిన స్మగ్లర్లు

గుజరాత్ పోర్టులో 3 వేల కిలోల డ్రగ్స్ : నేవీకి చిక్కిన స్మగ్లర్లు

గుజ‌రాత్‌ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నేవీ దళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ లో సుమారు 3 వేల 3 వందల కిలోల డ్రగ్స్ ను పట్టుకున్నారు.  గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. సుమారు 3089 కేజీల ఛార‌స్‌, 158 కేజీల మెటాఫెట‌మైన్‌, 25 కేజీల మార్ఫైన్‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న ఓ నౌకను నేవీ దళం, నార్కోటిక్స్ బ్యూరో పక్కా సమాచారంతో పట్టుకున్నారు. 

షిప్ లో ఐదుగురు పాకిస్తానీలు ఉన్నట్టు నేవీ అధికారులు గుర్తించారు. ఆ షిప్‌లో డ్రగ్ స్మగ్లింగ్స్ జ‌రుగుతున్నట్లు నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ ప‌ట్టివేత అని నేవీ వెల్లడించింది.  

 మన ఏజెన్సీలు దేశంలోనే అతిపెద్ద ఆఫ్‌షోర్ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంలో గొప్ప విజయాన్ని సాధించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు..ఎన్‌సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 3 వేల132 కిలోల భారీ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారని అన్నారు.మాదకద్రవ్యాల రహిత భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని అమిత్ షా తెలిపారు.