బిల్డింగ్ పై నుంచి పడి బాలుడు మృతి

బిల్డింగ్ పై నుంచి పడి బాలుడు మృతి

-బిల్డింగ్ రెడీ కాకున్నా కిరాయికి ఇస్తున్నరు
-రిపేర్లు మాత్రం చేయిస్తలేరు

హైదరాబాద్ చుట్టు పక్కల ఏరియాలలో కిరాయి ఇండ్లకు భారీగా డిమాండ్ ఉండటంతో బిల్డింగ్ పనులు పూర్తికాక ముందే రెంట్ కు ఇస్తున్నారు ఓనర్లు. దీంతో కిరాయికి ఉంటున్న వాళ్లు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందులో బాగంగా..సరిగ్గా లేని రేలింగ్ వల్ల మూడోఅంతస్తునుండి పడి చనిపోయాడు ఓ మూడేళ్ల పిలగాడు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో సురేష్ అనే అతనికి మూడు అంతస్తులు గల ఇల్లు ఉంది. ఆ మూడో ఫ్లోర్ లోకి అనిల్ కుమార్ చౌహాన్ తన భార్య పిల్లలతో కలిసి రెండు నెలల నుంచి కిరాయికి ఉంటున్నాడు.  సోమవారం సాయంత్రం అందరూ ఇంట్లో ఉండగా.. వరుణ్ తేజ్ ఆడుకుంటూ మూడో అంతస్తు రేలింగ్ నుంచి కిందకు పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్సపొందుతూవరుణ్  చనిపోయాడు. తన కొడుకు చనిపోవడానికి కారణం ఇంటి ఓనర్ సురేష్ అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనిల్ కుమార్. వారం రోజుల ముందునుంచి పాడయిపోయిన రేలింగ్ అద్ధాలను రిపేర్ చేయించమన్నా సురేష్ పట్టించుకోలేదని చెప్పారు.